ఘనంగా సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవం

by  |
ఘనంగా సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవం
X

దిశ, దామరచర్ల: దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు సీపీఐ జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ సీపీఐ అని చెప్పారు. గత 97 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత తమ పార్టీలదేనని గుర్తు చేశారు. దేశంలో కార్మికులు,క ర్షకుల కోసం సీపీఐ నాయకులు ఎనలేని త్యాగాలు చేశారని కొనియాడారు. నేటీకీ ఆ పోరాటాలు కొనసాగుతున్న విషయం విదితమేనని చెప్పారు.

మండలంలో పొడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. పార్ట్ బీ రైతులకు చెందిన అసైన్డ్ ల్యాండ్, పొడు భూములు, పట్టా భూములపై నిర్వహించిన సర్వే ప్రకారం అర్హులైన వారికి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్,జే. కోటయ్య,రైతు సంఘం నాయకులు పి.లక్ష్మయ్య,నాగేశ్వరరావు,డి.రాము,కే. కృష్ణ,ఎల్.రమేష్,టి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed