15 శాతం ట్రైన్ టికెట్ చార్జీలు రాష్ట్రాలు భరిస్తున్నాయి : కేంద్రం

by  |
15 శాతం ట్రైన్ టికెట్ చార్జీలు రాష్ట్రాలు భరిస్తున్నాయి : కేంద్రం
X

న్యూఢిల్లీ: వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్ టికెట్ చార్జీలను ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్నదని, వాటిని తాము చెల్లిస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రైల్వే సిబ్బంది, కేంద్ర ప్రభుత్వమూ స్పందించింది. ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయడం లేదని ఓ రైల్వే ఉద్యోగి తెలిపారు. కాగా, టికెట్ చార్జీల్లో 85శాతం కేంద్ర ప్రభుత్వం, మిగతా 15శాతం చార్జీలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ పద్ధతిని స్పెషల్ ట్రైన్‌లను అభ్యర్థించిన రాష్ట్రాలన్నీఅనుసరిస్తున్నాయని తెలిపింది. ఒకట్రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు సహకరిస్తున్నాయని పేర్కొంది.

tags: centre, for, migrants, special trains, borne, states

Next Story

Most Viewed