మహిళకు ఒకే రోజులో రెండు కరోనా డోసులు..

by  |
మహిళకు ఒకే రోజులో రెండు కరోనా డోసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చాక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా దేశంలో కరోనా రెండో వేవ్ కనిపిస్తుండటంతో కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. కరోనా టీకాలు త్వరితగతిన వినియోగించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అంతేకాకుండా, కరోనా వ్యాక్సిన్ వృథా విషయంపై ప్రధాని మోడీ యూపీతో సహా రెండు తెలుగు రాష్ట్రాలపై అసహనం వ్యక్తంచేశారు.

కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. టెస్టుల సంఖ్యను కూడా పెంచినట్లు సమాచారం. అయితే, వ్యాక్సినేషన్ లో భాగంగా కేరళలో చిన్న పొరపాటు దొర్లింది. 49ఏళ్ల మహిళకు ఒకే రోజులో కోవిషీల్డ్ టీకా రెండు డోసులు ఇచ్చారు. దీంతో ఆ మహిళ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి కొడుకు కథనం ప్రకారం.. వ్యాక్సినేషన్ కోసం వెళ్లిన తన తల్లికి మొదట నర్సు కరోనా టీకా ఇచ్చింది. అనంతరం కాటన్‌తో టీకా ఇచ్చిన చోట రబ్ చేస్తుండగా, అదే నర్సు మర్చిపోయి రెండో డోసు కూడా ఇచ్చింది. ఈ విషయం బయటకు తెలియడంతో వైరల్ అయింది. దీంతో సంబంధిత టీకా ఇచ్చిన నర్సుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేంద్ర వైద్యారోగ్య మార్గదర్శకాల ప్రకారం.. మొదటి టీకా తీసుకున్న సరిగ్గా 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే రోజులో రెండు డోసులు ఇవ్వడం మూలంగా శరీరం ఆ పవర్ తట్టుకునే చాన్స్ తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story

Most Viewed