లైట్ తీసుకున్నారు.. 400 మంది విద్యార్థులకు కరోనా

by  |
లైట్ తీసుకున్నారు.. 400 మంది విద్యార్థులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలను రీ ఓపెనింగ్ చేశారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏయిమ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, థర్డ్‌వేవ్ సంగతి దేవుడెరుగు. కానీ, సెకండ్ వేవ్ వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలను తెరిచినప్పటి నుంచి ఇప్పటివరకు 400 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం వెలుగుచూసింది. ఈ విషయాన్ని తమిళనాడు వైద్యారోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ స్పష్టంచేశారు. కరోనా బారిన పడిన విద్యార్థులందరినీ సెపరేట్ చేసి ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. ఇది ఒక్కొక్కరిగా వ్యాప్తి చెందినదని, సామూహిక వ్యాప్తి కాదన్నారు. ప్రభుత్వం, వైద్యఅధికారులు విద్యార్థులను క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, తమ పిల్లలు కరోనా బారిన పడటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.



Next Story

Most Viewed