ఏపీలో 24 గంటలు.. 38 కేసులు

by  |
coronavirus
X

దిశ, ఏపీ బ్యూరో: గడిచిన 24 గంటల్లో ఏపీలో జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో 38 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు, కర్నూలు జిల్లాలో తొమ్మిది కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన 38 కేసులతో రాష్ట్రంలో మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2018కు చేరుకుంది. ఇందులో 998 మంది హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. 45 మంది మృతిచెందారు. 975 మంది చికిత్స పొందుతున్నారు.

కర్నూలు జిల్లాలోనే 25 శాతంపైగా కేసులు

కర్నూలు జిల్లాలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతోంది. సోమవారం రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా ఈ జిల్లాలోనే ఉన్నాయి. కొత్తగా తొమ్మిది కేసులు నమోదు కావడంతో కర్నూలులో బాధితుల సంఖ్య 575కు చేరుకుంది. ఇప్పటివరకు 267 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. 16 మంది మృతిచెందారు. 292 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక కేసులు, మరణాలూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన, నమోదవుతున్న కేసుల్లో 25 శాతానికిపైగా ఈ ఒక్క జిల్లా నుంచే ఉండటం గమనార్హం.

విశాఖపట్టణంలో హోంగార్డుకు కరోనా

విశాఖపట్టణంలో సోమవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మహిళ ఉన్నారు. ఆమెను గీతం యూనివర్సిటీలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్‌కు తరలించారు. హోంగార్డు తండ్రి, సోదరిని క్వారంటైన్‌ చేశారు.

Next Story

Most Viewed