అప్పుడు గుడ్డు… ఇప్పుడు పాప

by  |
అప్పుడు గుడ్డు… ఇప్పుడు పాప
X

దిశ, వెబ్‌డెస్క్ : 27 ఏళ్ళ క్రితం గుడ్డు ఇప్పుడు పాప అవడం ఏంటి అనుకుంటున్నారా…? సైన్స్ తో సాధ్యం కానిది ఏముంది చెప్పండి. ‘ఫ్రీజింగ్ ఎగ్’ గురించి ఇటీవలే మనం ‘దిశ’లో చెప్పుకున్నాం. ఫ్రీజింగ్ ఎగ్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి ‘ఫ్రీజింగ్ ఎగ్’ చరిత్రలోనే అతి ఎక్కువ కాలం ఫ్రీజ్ చేసిన పిండం ద్వారా ప్రస్తుతం అమెరికాకు చెందిన టీనా తల్లయ్యింది. దీంతో టీనా కూతురు మోలీ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. ఇది వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాకు చెందిన టీనా, బెన్ గిబ్సన్‌ దంపతులు పిల్లలు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు అయ్యేందుకు వారు ‘ఎగ్ ఫ్రీజింగ్’ మెథడ్‌ను ఆశ్రయించారు. టీనా 1992లో తన అండాలను ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతిలో భద్రపరిచింది. ఆ తర్వాత తనకు పిల్లలు పుట్టకపోవడంతో 24 ఏళ్ల క్రితం భద్రపరిచిన అండాలను కృత్రిమ ప‌ద్ధతిలో తన గ‌ర్భాశ‌యంలోకి ఎక్కించారు. మెడికల్ సైన్స్ బ్రేక్ చేస్తూ, టీనా బేబీ గర్ల్‌కు జ‌న్మనిచ్చింది. సాధారణంగా 10-12 సంవత్సరాల క్రితం ఫ్రీజ్ చేసిన ఎగ్స్‌ను మాత్రమే ఐవీఎఫ్‌కు ఉపయోగిస్తారు. కానీ టీనా 24 ఏళ్ల క్రితం నాటి పిండాలతో గర్భం దాల్చి, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలా 2017లో పుట్టిన ఆ అమ్మాయికి ఎమ్మా వ్రెన్ గిబ్సన్‌ అని పేరు పెట్టగా, ఆ చిన్నారి 24 ఏళ్ల నాటి ఫ్రీజింగ్ ఎగ్‌తో పుట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఎమ్మా రికార్డ్‌ను తన చెల్లి ‘మోలీ ఎవరెట్టి గిబ్సన్’ బ్రేక్ చేసింది. ఎమ్మాకు అనుసరించిన పద్ధతిలోనే మొల్లికి కూడా జన్మనిచ్చింది టీనా. కాగా నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్, టెన్నెసి ప్రెస్టన్ మెడికల్ లైబ్రరీ దీన్నొక అద్భుతంగా అభివర్ణించారు. మోలీ, ఎమ్మా ఇద్దరూ కూడా జెనెటిక్ సిబ్లింగ్స్.

ఐవీఎఫ్ చికిత్స చేసుకునే వారు.. అద‌నంగా పిండాల‌ను ‌దానం చేయాల్సి ఉంటుంది. పిల్లలు కాని వారు, ఆ పిండాల‌ను ద‌త్తత తీసుకుంటారు. కానీ అప్పటి వ‌ర‌కు ఆ పిండాల‌ను మైన‌స్ ఉష్ణోగ్రత‌ల్లో ఫ్రీజ్ చేస్తారు. పిండ దానంలో స్త్రీకి జన్యుపరంగా సంబంధం లేని పిండాలను ఆమె గర్భాశయంలోకి బదిలీ చేస్తారని నేషనల్ ఎంబ్రియో డోనేషన్ సెంటర్ వైద్యులు తెలిపారు. ఇలా పుట్టిన పిల్లలకు, తల్లికి మధ్య బయోలాజికల్‌గా సంబంధం ఉండదు.


Next Story

Most Viewed