తవ్వకాల్లో బయటపడ్డ బీసీ కాలంనాటి కాంస్య ఎద్దు విగ్రహం

by  |
తవ్వకాల్లో బయటపడ్డ బీసీ కాలంనాటి కాంస్య ఎద్దు విగ్రహం
X

దిశ, ఫీచర్స్ : పురాతన కాలం నాటి శిలాజాలు, వస్తు అవశేషాల ద్వారా తమ పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకు ఆయా దేశాల పురావస్తు శాఖలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు ఆర్కియాలాజికల్ డిపార్ట్‌మెంట్స్ ఇప్పటికే గుర్తించిన పురావస్తు ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నాయి. ఆర్కియాలజిస్టులు తమ రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. తాజాగా గ్రీస్ దేశంలో ఆర్కియలాజికల్ సైట్ ఒలంపియాలో అనుకోకుండా ఓ కాంస్య వస్తువు బయటపడింది. ఇంతకీ ఆ వస్తువును పురావస్తు శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారంటే..

ఇటీవల గ్రీస్‌లో భారీ వర్షపాతం నమోదైంది. ఆ సమయంలో పురావస్తు ప్రదేశమైన ఒలంపియాలోని గ్రీస్ దేవుడు జియాస్ ఆలయ పరిసరాల్లో భూమి కోతకు గురైంది. ఈ క్రమంలోనే అక్కడ చిన్న కాంస్య ఎద్దు విగ్రహానికి చెందిన కొమ్ములు కనబడగా, పురావస్తు శాస్త్రవేత్తలు దాన్ని పూర్తిగా వెలికితీశారు. దీన్ని పరిశీలించిన మీదట సుమారు 1,050-700 బీసీ కాలం నాటి గ్రీస్ దేశస్తులు తమ దేవుడైన జియాస్‌ను ఆరాధించే క్రమంలో ఇలాంటి వేల కాంస్య విగ్రహ ప్రతిమలను కానుకగా ఇచ్చినట్లు చెప్తున్నారు. పురాతనమైన ఈ కాంస్య ఎద్దు విగ్రహం 2,500 ఏళ్ల కిందటిదని నిర్ధారించిన ఆర్కియాలజిస్టులు దీనిపై మరింత పరిశోధన చేస్తామని తెలిపారు.



Next Story

Most Viewed