వన్డే వరల్డ్ కప్: భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి వెళ్లేవారికి సూపర్ ఛాన్స్.. వారికి ప్రత్యేకంగా..

by Dishafeatures2 |
వన్డే వరల్డ్ కప్: భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి వెళ్లేవారికి సూపర్ ఛాన్స్.. వారికి ప్రత్యేకంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడుతుంటే.. కళ్లారా చూడాలని క్రికెట్‌ను చూసే ప్రతీఒక్క అభిమానికి ఉంటుంది. గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య జరిగే సమరాన్ని చూసేందుకు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. భారత్, పాక్ మధ్య చాలా తక్కువగా మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రెండు టీమ్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాక్ పోరుకు సర్వం సిద్దమైంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌ వేదికగా దాయాది దేశంతో టీమిండియా తలపడనుంది. ఈ రసవత్తర పోరును చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ప్రేక్షకులు స్టేడియంకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల కోసం అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక సర్వీసులను తిప్పనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని వల్ల ప్రేక్షకులు సులువుగా, వేగంగా అహ్మదాబాద్‌కు చేరుకోవచ్చు.

భారత్, పాక్ మ్యాచ్ రోజు అహ్మదాబాద్‌కు ఫ్లైట్ టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు తక్కువ ధరలో అహ్మదాబాద్ చేరుకునేలా ప్రత్యేక ట్రైన్లను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో ప్రత్యేక వందే భారత్ ట్రైన్లలో టికెట్ ధరలు, టైమింగ్స్ వివరాలను రైల్వేశాఖ వెల్లడించనుంది. మ్యాచ్ చూడటానికి వెళ్లేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed