టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై..? రేసులోకి ఊహించని పేరు

by Dishafeatures2 |
టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై..? రేసులోకి ఊహించని పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది క్రికెటర్లు వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో పలు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతుండగా.. వన్డే వరల్డ్ కప్ తర్వాత పదవి నుంచి తప్పుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వన్డే ప్రపంచకప్ తర్వాత బీసీసీతో ద్రవిడ్ కుదుర్చుకున్న ఒప్పందం ముగియనుంది. దీంతో ఆ తర్వాత ద్రవిడ్ కొనసాగుతారా? లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటారా? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా నియామకం అయిన తర్వాత జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వైఫల్యం చెందింది. దీంతో ద్రవిడ్‌పై విమర్శలు చేస్తున్నాయి. టీమ్‌లో ఆటగాళ్లను ప్రతీసారి మార్చుతుండటం వల్లనే టీమిండియా ఐసీసీ ఈవెంట్స్‌లలో ప్రదర్శన చేయలేకపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ద్రవిడ్ అని చెబుతున్నారు.

త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనను బట్టి ద్రవిడ్ నిర్ణయం ఉంటుందని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఒక బీసీసీఐ అధికారి మాట్లాడుతూ. ఒకవేళ వన్డే ప్రపంచకప్‌లో భారత్ గెలిచినా ద్రవిడ్ హెడ్ కోచ్‌గా కొనసాగకపోవచ్చని చెప్పారు. దీంతో వన్డే వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ తన కాంట్రాక్ట్‌ను మరోసారి పొడిగించుకోకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

రేసులోకి ఊహించని పేరు

రాహుల్ ద్రవిడ్ తప్పుకుంటే కొత్త హెడ్ కోచ్ ఎవరనే చర్చ జరుగుతోంది. హెడ్ కోచ్ పదవి కోసం ఆశిష్ నెహ్రా ఆసక్తి చూపుతున్నాడు. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను గెలుచుకోవడంలో ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. దీంతో హెడ్ కోచ్ పదవి కోసం నెహ్రా పోటీ పడుతున్నాడు.



Next Story

Most Viewed