'ఇప్పుడు గెలవకపోతే.. మరో 3 వరల్డ్‌ కప్‌లు ఆగాల్సిందే'

by Vinod kumar |   ( Updated:2023-11-12 13:44:03.0  )
ఇప్పుడు గెలవకపోతే.. మరో 3 వరల్డ్‌ కప్‌లు ఆగాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో సెమీస్‌కు చేరిన టీమిండియా వరుస విజయాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ను చేజిక్కించుకోవాలని.. లేకపోతే మళ్లీ నిరీక్షణ తప్పదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దని.. లేకపోతే అప్పటివరకు మళ్లీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇప్పుడు భారత జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్‌ అనిపిస్తోంది. ఒకవేళ ఈసారి చేజారితే.. మళ్లీ విశ్వవిజేతగా నిలవడానికి కనీసం మూడు వరల్డ్‌ కప్‌ల వరకు ఆగాల్సిందే. ఇప్పుడున్న జట్టులో ఏడెనిమిది మంది ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అంతేకాకుండా వారిలో చాలామందికి ఇదే చివరి వరల్డ్‌ కప్‌. వారు ఆడుతున్న తీరు, పిచ్‌ పరిస్థితులు, భారత్‌ సాధిస్తున్న విజయాలను చూస్తుంటే కష్టమేం కాదనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story