- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా పూణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న ఇంగ్లీష్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15) మరోసారి నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ మలన్ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. డేవిడ్ మలన్ (87) పరుగుల వద్ద రన్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆర్యన్ దత్ వేసిన ఏడో ఓవర్లోనే బెయిర్ స్టో.. వాన్ మీకెరెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 24 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్.. 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (10), హ్యారీ బ్రూక్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలవకుంటే 2025లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు కోల్పోనుంది.