Ravichandran Ashwin : ఇదే నా చివరి వరల్డ్ కప్ కావొచ్చేమో.

by Disha Web Desk 1 |
Ravichandran Ashwin : ఇదే నా చివరి వరల్డ్ కప్ కావొచ్చేమో.
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా టీమిండియాలో చోటు సంపాదించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో అతడి స్థానంలో మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు తుది జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ, అనుహ్యంగా ఆ అవకాశం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కింది. అయితే, ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతడు గౌహతీకి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ విలేకరులతో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ తుది జట్టులోకి ఆలస్యంగా వచ్చాననే విషయం తాను పట్టించుకోనని అన్నాడు. జీవితం సర్‌ప్రైజ్‌లతో కూడి ఉంటుందని, నేను ఇక్కడ ఉంటానని నిజంగా అనుకోలేదన్నాడు.

గత నాలుగేళ్లుగా ఇదే ఆటతీరును కొనసాగిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే, ప్రపంచకప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమని, టోర్నీలో అది కచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పాడు. ఇదే తన చివరి వరల్డ్ కప్ ఈవెంట్ కావొచ్చేమోనని తెలిపాడు. భారత జట్టును విజేతగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నాడు. సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయబోనని పేర్కొన్నాడు. కాగా, అశ్విన్‌కు ఇది మూడో వన్డే వరల్డ్ కప్ ఈవెంట్. గతంలో 2011, 2015 ప్రపంచకప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో భాగమైన విరాట్ కోహ్లీ, అశ్విన్ మాత్రమే.. ఈ ప్రపంచకప్‌లోనూ భాగమవుతున్నారు.



Next Story