- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: టీమిండియాకు జర్మన్ ఫుట్‌బాల్ స్టార్ మద్దతు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా సెమీఫైనల్స్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు క్రికెట్ అభిమానుల నుంచే గాక ఫుట్‌బాల్ స్టార్స్ నుంచీ మద్దతు లభిస్తోంది. బుధవారం వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ బెర్న్ మునిచ్, జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజం థామస్ ముల్లర్ మద్దతు తెలిపాడు. టీమిండియా జెర్సీ ధరించి రోహిత్ సేనకు తన మద్దతు ప్రకటించాడు.
ప్రపంచకప్ సెమీస్‌కు ముందు ముల్లర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘ఇది చూడండి. ఈ షర్ట్ పంపినందుకు గాను టీమిండియాకు ధన్యవాదాలు. క్రికెట్ వరల్డ్ కప్‌లో మీకు గుడ్ లక్’ అంటూ.. టీమిండియా అతడికి పంపిన జెర్సీని వేసుకుని రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు. వీడియోలో ముల్లర్.. విరాట్ కోహ్లీ పేరు కూడా మెన్షన్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్–కివీస్‌ల మధ్య బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది.