కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాదీ గర్ల్..

by  |
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాదీ గర్ల్..
X

దిశ, ఫీచర్స్ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక ఇటీవలే అధిరోహించింది. ఈ ఫీట్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన మురికి పులకిత హస్వి.. పర్వతారోహణలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అనేక రకాల వాతావరణ పరిస్థితులను కలిగిన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడ ఒక సాహసోపేతమైన అనుభవమని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తర్వాత ఇందుకోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు వివరించింది.

బేస్ క్యాంప్ పూర్తయిన తర్వాత, ఏడు శిఖరాలను అధిరోహించాలని డిసైడ్ అయినట్లు తెలిపిన హస్వి.. మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా, ధ్యానం వంటి యాక్టివిటీస్ చేస్తానని వెల్లడించింది. ఇక తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడుతూ.. 2024కు ముందే మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నానని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా.. ‘పర్వతారోహణను ఎంచుకునే బదులు వారి జీవితంలోని పర్వతాన్ని జయించాలని’ యువతకు సందేశాన్నిచ్చింది.

Next Story

Most Viewed