దారుణం.. ఆక్సిజన్ లేక 13 మంది మృతి

by  |
దారుణం.. ఆక్సిజన్ లేక 13 మంది మృతి
X

చెన్నై: తమిళనాడులోని ఓ ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కనీసం 13 మంది పేషెంట్లు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక వీరు మరణించారని స్థానికులు చెబుతుంటే అధికారులు వాటిని ఖండిస్తు్న్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత మెడికల్ ఐసీయూ సహా మూడు బ్లాకుల్లో వరుసగా మరణాలు సంభవించాయని తెలిసింది. అదే రోజు ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఆలస్యమైందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన ట్యాంకర్ సాయంత్రం నాలుగింటికి వచ్చిందని వివరించాయి. హాస్పిటల్‌లో మొత్తం 309 మంది పేషెంట్లు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారని, వారందరికీ సరిపడా ఆక్సిజన్ అందిస్తు్న్నామని కలెక్టర్ జాన్ లూయీస్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ ఉన్నట్టు ధ్రువీకరించిన వ్యక్తి ఒక్కరే మరణించిన వారిలో ఉన్నారని వివరించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్‌లో లోపమున్నట్టు ధ్రువీకరించారు. ప్రెషర్ పడిపోవడానికి గల కారణాలను కనుగొనడానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆక్సిజన్ సప్లయర్లు ప్రైవేటు హాస్పిటల్స్‌కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఇక్కడ నిరంతరాయ ఆక్సిజన్ అందించడం లేదని హాస్పిటల్‌లోని కొన్ని వర్గాలు తెలిపారు.



Next Story

Most Viewed