విద్యాసంస్థల్లో 100% వ్యాక్సినేషన్ తప్పనిసరి : సీఎస్

by  |
cs-somesh-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు.

100శాతం వ్యాక్సినేటెడ్ అయిన విద్యాసంస్థల్లో అందరూ వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా బోర్డ్ ప్రదర్శించాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్స్.. స్థానిక వైద్యాధికారులతో సమన్వయం చేసుకొని ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

సెప్టెంబర్ 10లోపు అన్ని విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతీ రోజు ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు.

Next Story

Most Viewed