ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

by Disha Web Desk 15 |
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజ్ గిరి పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని లోక్ సభ జనరల్ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా అన్నారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ పాట్స్ ల రెండవ దశ రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం మేడ్చల్ కలెక్టరేట్ లోని వీసీ మీటింగ్ హాల్ లో మల్కాజ్ గిరి ఎన్నికల

అధికారి గౌతమ్ ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ జాయింట్ సీఈఓ ఆకాశ్ కుమార్ శర్మ, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి లతో కలిసి ప్రియాంక శుక్లా రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో 37 లక్షల ఓటర్లున్నట్లు తెలిపారు. అందు కోసం ప్రతి ఎన్నికల అధికారి సమయస్పూర్తితో పనిచేసి, ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 232 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు 580, కంట్రోల్ యూనిట్లు 290, వీవీ పాట్స్ 324 కేటాయించినట్లు ప్రియాంక శుక్లా చెప్పారు.

Next Story

Most Viewed