మోడీ పాత్రలో కట్టప్ప!.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన సత్యరాజ్

by prasad |
మోడీ పాత్రలో కట్టప్ప!.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన సత్యరాజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాహుబలి చిత్రంలో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సత్యరాజ్ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ లో నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సత్యరాజ్ ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ పాత్రలో నటించబోతున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకులు రమేశ్ బాల శనివారం ట్వీట్ చేశారు. మోడీ పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నారని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఈ సినిమా మోడీపై రెండవ బయోపిక్ అవుతుంది. 2019లో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన పీఎం నరేంద్ర మోడీ సినిమా విడుదల కాగా... తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అన్ని భారతీయ భాషల్లో మరో బయోపిక్ ప్లాన్ హాట్ టాపిక్ గా మారింది.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed