BREAKING : ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 4 |
BREAKING : ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈవీఎం-వీవీ ప్యాట్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా.. వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈవీఎం-వీవీ ప్యాట్లకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు సూచనలు చేసింది. సింబల్ లోడింగ్ తర్వాత ఎస్ఎల్‌యూలు సీల్ చేసి 45 రోజుల భద్రంగా ఉంచాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంల పరిశీలనకు వీలు కల్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇంజినీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కల్పించాలని తెలిపింది. ఈవీఎల పరిశీలనకు అభ్యర్థుల నుంచి 7 రోజుల్లో వినతి వస్తే పరిగణించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టేసింది.

Read More..

Andhra University: ఏయూకు షాక్ ఇచ్చిన జేసీ.. 'అచీవర్స్‌ డే రద్దు




Next Story