తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..ఆ మూడు ప్రభుత్వ కళాశాలలకు అటానమస్ హోదా..

by Disha Web Desk 3 |
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..ఆ మూడు ప్రభుత్వ కళాశాలలకు అటానమస్ హోదా..
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదాను కలిపిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యాక్‌-ఏ గ్రేడ్‌ను దక్కించుకోవడంతో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు యూజీసీ అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. కాగా అటానమస్ హోదాను దక్కించుకున్న కళాశాలల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

ఇక గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని 11 డిగ్రీ కాలేజీలు అటానమస్‌ హోదాను కైవసం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని మరో మూడు కళాశాలలకు అటానమస్ హోదా రావడంతో రాష్ట్రంలోని మొత్తం అటానమస్ కళాశాలల సంఖ్య 14కు చేరింది. అటానమస్‌ హోదా విషయంలో యూజీసీ ఇటీవల పలు మార్పులు చేసింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సందడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసేలా పోర్టల్‌‌ను మోడీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజీసీకి దరఖాస్తు చేసేలా పోర్టల్‌ ప్రకారం కళాశాల స్థాపించి పది సంవత్సరాలై ఉండి.. న్యాక్‌-ఏ గ్రేడ్‌ పొందినట్లైతే ఆ కళాశాలకు అటానమస్‌ హోదాను కేద్రం కల్పిస్తోంది. అలానే న్యాక్‌-ఏ గ్రేడ్‌ లేని కాలేజీల్లో కనీసం మూడు బ్రాంచ్‌లకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ ఉన్నా ఈ హోదా ఇస్తారు.



Next Story