నగరంలో నివాసులుగా 'రోబోలు'.. ప్రయోగాలకు మనుషులు..

by Disha Web Desk 20 |
నగరంలో నివాసులుగా రోబోలు.. ప్రయోగాలకు మనుషులు..
X

దిశ, ఫీచర్స్ : భవిష్యత్తులో ప్రపంచం ఎలా మారిపోతుంది, ఎలాంటి అభివృద్ది జరుగుతుంది తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇప్పటికే పెరిగిన టెక్నాలజీని భవిష్యత్తులో ఇంకా ఉండనుంది, ఎలాంటి కొత్త రూపకల్పనలు చేయబోతుంది అనే విషయాలను గురించి తెలసుకోవాలనుకుంటారు. అలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ, కోట్లాది రూపాయలను కర్చచేస్తూ నిర్మిస్తున్న భవిష్యత్ నగరాల గురించిన సమాచారం అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నగరాల్లో మనుషుల కంటే కూడా రోబోలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయట. అంతేకాదు రోబోలే ప్రయోగాలు చేస్తూ మనుషులను ఉపయోగిస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న భవిష్యత్ నగరంగా చెప్పుకునే వోవెన్ సిటీ గురించి తెలుసుకుందాం.

జపాన్ లో ఎంతో ఫేమస్ అయిన కార్ కంపెనీ టయోటా ఈ నగరాన్ని నిర్మిస్తోంది. 2021 నుంచి నిర్మిస్తున్నఈ నగరం మౌంట్ ఫుజికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. ఈ నగరంలో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ సంగమంగా ఉండనుంది. ముందుగా 200 మంది ఇక్కడ స్థిరపడతారు. భవిష్యత్తులో దీనిని 2,000 మందికి పెంచనున్నారు.

ల్యాబ్‌గా పని చేయనున్న నగరం..

ది సన్ నివేదిక ప్రకారం నిజానికి వోవెన్ సిటీ ఒక ల్యాబ్‌గా పనిచేస్తుంది. ఇక్కడ టయోటా దాని పునరుత్పాదక, శక్తి సామర్థ్య స్వీయ - డ్రైవింగ్ కార్లను పరీక్షిస్తుంది. ఈ కార్లకు 'ఈ-పాలెట్స్' అని పేరు పెట్టారు. అయితే అన్ని పనులు రోబోటిక్స్ సహాయంతో పూర్తవుతాయి, అప్పుడు ఇక్కడ మానవుల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రయోగంలో భాగంగా మానవులు..

WOVENలో ఆటోమేటిక్ కార్లను మాత్రమే పరీక్షించాలి. అలాంటప్పుడు కంపెనీ ప్రజల నడక విధానాలు, వారి డ్రైవింగ్ నమూనాలను అర్థం చేసుకోవాలనుకుంటోంది. ఈ ప్రయోగం కోసం మనుషులు కూడా ఇక్కడే స్థిరపడతారు.

ఫ్యూచర్ సిటీకి ఎంత ఖర్చు అవుతుంది ?

వోన్ సెటిల్మెంట్ కోసం 8 బిలియన్ పౌండ్ల (అంటే సుమారు 83 వేల కోట్లు) బడ్జెట్ అవసరమట. నగరంలో ప్రజలు హైడ్రోజన్‌తో నడిచే స్మార్ట్ హోమ్‌లలో నివసిస్తారు. ఇళ్ల పైకప్పుల పై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల నగరాన్ని పర్యావరణహితంగా మారుస్తామని నివేదికలో తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్య సంబంధిత సమస్యల పై నిఘా ఉంచేందుకు AI టెక్ అందుబాటులో ఉంటుంది.

రోబోలు అన్ని పనులు చేస్తాయి..

ఈ నగరం చాలా ఆధునికంగా ఉంటుంది. తద్వారా భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా వస్తువులు పంపిణీ అవుతాయి. నగరంలో అన్ని నిర్మాణాలు రోబోల సాయంతో జరగనున్నాయి. సాంప్రదాయ జపనీస్ నైపుణ్యాలను కూడా ఇందులో ఉపయోగించనున్నారు. అలాగే హైడ్రోపోనిక్స్ ద్వారా ఆహారాన్ని పండించాలనే ఉద్దేశ్యం ఉంది. నగరంలో మూడు రకాల రోడ్లు రానున్నాయి. పాదచారులకు ఒకటి. రెండవది వేగవంతమైన వాహనాల రాకపోకలు, మూడవది నెమ్మదిగా కదిలే ట్రాఫిక్కు.



Next Story

Most Viewed