అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసు.. కాంగ్రెస్ కీలక నేతకు 3 రోజుల కస్టడీ

by Disha Web Desk 9 |
అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసు.. కాంగ్రెస్ కీలక నేతకు 3 రోజుల కస్టడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో స్పిరిట్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తోన్న అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అరుణ్ రెడ్డికి కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి కావాలని తప్పులు కేసులు పెట్టాలని చూస్తున్నారని బార్డర్ దగ్గర సైనికులొచ్చినా నన్ను ఏం చేయలేరని మండిపడ్డారు. ఇక అరుణ్ రెడ్డిని పాటియాల హౌస్ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫేక్ వీడియోలో బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా క్రియేట్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు.

Next Story

Most Viewed