బెడ్ షీట్‌నే గౌన్‌లా చేసుకున్న జాన్వీ కపూర్.. డబ్బుల్లేవా అంటూ ఆడేసుకుంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
బెడ్ షీట్‌నే గౌన్‌లా చేసుకున్న జాన్వీ కపూర్.. డబ్బుల్లేవా అంటూ ఆడేసుకుంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే. ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మత్స్యకారుల కూతురిగా కనిపించనుంది. అయితే జాన్వీ కపూర్ తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది.

ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పొట్టి గౌన్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఇందులో మెట్లపై హాట్ స్టిల్స్ ఇచ్చి.. థైయ్స్ చూపిస్తూ సమ్మర్ ట్రీట్ ఇచ్చింది. అలాగే కూర్చుని మత్తెక్కించే కళ్ళతో చూపుతిప్పుకోనివ్వకుండా ఫోజులిచ్చింది. ప్రస్తుతం జాన్వీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు బెడ్ షీట్‌నే గౌన్‌లా తయారుచేయించుకున్నావా? బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? అంటూ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed