జ్ఞాపకాలు ఎక్కువగా ఉన్నాయా.. అయితే మీ మెదడు ప్రమాదంలో ఉన్నట్టే?

by Disha Web Desk 8 |
జ్ఞాపకాలు ఎక్కువగా ఉన్నాయా.. అయితే మీ మెదడు ప్రమాదంలో ఉన్నట్టే?
X

దిశ, ఫీచర్స్ : జ్ఞాపకాలు మంచి వైనా చెడ్డవైనా సరే మోయక తప్పదు అనే డైలాగ్ అందరికీ తెలిసిందే. జ్ఞాపకాలు అంటే చాలు మనం మన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మనకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని తలుచుకొనే ఉంటాము. ఎందుకంటే అవి అంత సంతోషాన్ని, హాయిని ఇస్తాయి అంటారు. కానీ ఆ జ్ఞాపకాలే మెదడుకు హాని కలిగిస్తున్నాయంట.ఇది గుర్తు పెట్టుకోవాలి.. ఈ సిట్యూవేషన్ నా లైఫ్‌లో మర్చిపోలేని జ్ఞాపకం అని మన మనసుకు మనం చెప్పుకునే ప్రతిసారి మన మెదడు కణాలపై ఎఫెక్ట్ పడుతుందంట. దీని కారణంగా మన మెదడు దెబ్బతినే అవకాశం ఉన్నదంటున్నారు నిపుణులు.

న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన న్యూరో సైంటిస్టులు, మనం కొత్తగా ఏదైనా గుర్తు పెట్టుకునేటప్పుడు మన మెదడు పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అని ఎలుకలపై పరిశోధన చేయగా.. జ్ఞాపకాలు అనేవి మెదడులోని కణజాలకు హాని చేస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ జ్ఞాపకాలు అనేవి మన మెదడుపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకరావడం వలన ఇది మెదడు న్యూరాన్​ల వాపునకు దారి తీస్తుందని, అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత సమస్యలకు కూడా కారణం అవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అంతే కాకుండా దీర్ఘకాలికంగా ఏదైనా గుర్తుపెట్టుకునే ప్రక్రియను మెదడుపై చూపిస్తే.. దానివల్ల నాడీ కణాలలో DNA దెబ్బతింటుందని కొత్త అధ్యయనం తెలిపింది.



Next Story