వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు జూమ్ ‘టచ్’

by  |
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు జూమ్ ‘టచ్’
X

దిశ, వెబ్ డెస్క్: కొవిడ్ ప్రభావంతో.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు‘రిమోట్ వర్క్’అవకాశం కల్పిస్తున్నాయి. దాదాపు ఈ ఏడాదంతా కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’కే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ కంపెనీ జూమ్ ఓ సరికొత్త హార్డ్‌వేర్ ప్రొడక్ట్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. జూమ్ ఫర్ హోం కేటగిరీలో ‘డీటెన్ మీ’ అనే 27 అంగుళాల పరిమాణంలో ఉన్న ఓ మానిటర్‌ను లాంచ్ చేసింది. జూమ్ నుంచి వచ్చిన తొలి హార్టవేర్ ప్రొడక్ట్ ఇదే. భవిష్యత్తులో రిమోట్ వర్కింగ్‌కు, ఆఫీస్ వర్క్‌కు ఉపయోగపడేలా.. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరికరాలను రూపొందిస్తున్నట్లు జూమ్ వెల్లడించింది.

కరోనా వల్ల.. ఇల్లే ఆఫీసుగా మారిపోయింది. కరోనా ప్రభావంతో.. భవిష్యత్తులో కూడా రిమోట్ వర్క్ ప్రాధాన్యం పెరిగేలా కనిపిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ సులభంగా ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించేందుకు వీలుగా ‘డీటెన్ మీ’ ఉపయోగపడుతుందని జూమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా డీటెన్ మీ .. మానిటర్ ద్వారా ఒకే క్లిక్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, గ్రాఫ్‌లు డిజైన్ చేసుకోవడం, పేపర్ వర్క్ లాంటి పనులన్నీ ఇందులోని టచ్‌స్క్రీన్‌తో సునాయాసంగా చేసుకోవచ్చని సంస్థ యాజమాన్యం చెబుతోంది. వీడియో మీటింగ్, ఫోన్ కాల్స్, కంటెంట్ షేరింగ్, ఇంటారాక్టివ్ వైట్ బోర్డింగ్, కో అన్నోటేషన్ వంటివన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఎడిషనల్ మానిటర్, స్పీకర్లు, కీబోర్డ్, మౌజ్ వీటితో ఇక ఏ పనిలేకుండా.. కేవలం ఒక్క టచ్‌తో హ్యాపీగా పనిచేసుకోవచ్చని జూమ్ తెలిపింది. ఇందులో 3 స్మార్ట్ వెబ్ క్యామ్స్ ఉన్నాయి. దీని ధర రూ.45వేలుగా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ‘రిమోట్ వర్కర్క్ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించామని , మరిన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వారి కోసం రూపొందించాలని ’ జూమ్ తెలిపింది

Next Story