మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కు జడ్ ప్లస్ భద్రత

by  |
మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కు జడ్ ప్లస్ భద్రత
X

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు ‘జడ్ ప్లస్’ సెక్యూరిటీని కల్పిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా గొగోయ్ ఎక్కడికి ప్రయాణించిన ఆయన‌కు సాయుధులైన సీఆర్‌పీఎఫ్ కమాండోలు భద్రతను కల్పిస్తారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో గొగోయ్‌ భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించేవారు. 2019, నవంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. ‌‘జడ్ ప్లస్’ వీఐపీ సెక్యూరిటీని సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుంటుంది. దేశంలో జడ్ ‌ప్లస్ సెక్యూరిటీని పొందిన 63వ వ్యక్తి గొగోయ్.

Next Story

Most Viewed