శ్రీవారి భక్తులకు సూచన.. దర్శనాలు వాయిదా వేసుకోండి

by  |
శ్రీవారి భక్తులకు సూచన.. దర్శనాలు వాయిదా వేసుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఒక్కసారిగా ఘాట్ రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగుచోట్ల రోడ్డు పూర్తిగా పాడయ్యింది. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్డు కుంగింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి భక్తులకు పలుసూచనలు చేశారు. ఘాట్ రోడ్డు మరమ్మతు చేసేందుకు దాదాపు మూడు రోజులు సమయం అవుతుందని దర్శనానికి వచ్చే భక్తులు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండ చరియలు పడినప్పుడు వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. రోడ్డును రిపేర్ చేసేందుకు ఐఐటీ నిపుణులు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed