‘ఏదైనా ఉంటే మాకు చెప్పండి.. ఇది పద్ధతి కాదు’

by  |
‘ఏదైనా ఉంటే మాకు చెప్పండి.. ఇది పద్ధతి కాదు’
X

దిశ ఏపీ బ్యూరో: టీటీడీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవాలయ ఆగమ సలహాదారు, ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఈవో, డిప్యూటీ ఈవోను విమర్శిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రమణ దీక్షితులు సలహాలేవైనా ఇవ్వాలనుకుంటే పాలకమండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన లాంటి వ్యక్తి బహిరంగంగా విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. దీనిపై రమణ దీక్షితులుతో చర్చించమని అధికారులును ఆదేశిస్తానని ఆయన చెప్పారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని, అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

Next Story

Most Viewed