రోజూ 50 వేల మంది కడుపు నింపుతున్న టీటీడీ: వైవీ సుబ్బారెడ్డి

by srinivas |   ( Updated:2020-03-29 00:23:26.0  )
రోజూ 50 వేల మంది కడుపు నింపుతున్న టీటీడీ: వైవీ సుబ్బారెడ్డి
X

లాక్ డౌన్ కాలంలో నిరుపేదల కడుపు నింపేందుకు టీటీడీ ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టిందని టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరుపేదల కడుపు నింపేందుకు టీటీడీ రోజుకు 50 వేల ఆహార పొట్లాలను ఉచితంగా అందించనుందని తెలిపారు. నిన్న 20 వేల ప్యాకెట్లు వితరణ చేశామని ఆయనవెల్లడించారు. కరోనా సహాయక చర్యల్లో టీటీడీ కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగా తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని, తిరుచానూరు పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ వార్డుగా మారుస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా ఆసుపత్రికి అవసరమైన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను స్విమ్స్ ఆసుపత్రి నుంచి అందిస్తామని ఆయన తెలిపారు.

Tags : ttd, yv subba reddy, corona service, padmavathi university

Advertisement

Next Story