దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు.. యువీపై కేసు

by  |
దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు.. యువీపై కేసు
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియాలో కీలక స్పిన్నర్ అయిన యజువేంద్ర చాహల్ టిక్‌టాక్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. గతంలో అతను చేసిన టిక్‌టాక్ వీడియోలకు సంబంధించి యువరాజ్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఒక లైవ్ చాట్‌లో యువీ, రోహిత్ శర్మ మాట్లాడుకుంటూ.. చాహల్ డ్యాన్సులపై కామెంట్ చేశారు. ‘వీళ్లకేం పని లేదు.. బాంగీ మనుషుల్లా యూజీకి కూడా పనీ పాట లేదు’ అని యువరాజ్ వ్యాఖ్యానించాడు. అయితే బాంగీ అనేది ఒక దళిత కమ్యూనిటీ. దాన్ని కించపరుస్తూ యువీ వ్యాఖ్యలు చేశాడని, ఒక కులాన్ని కించపర్చమేంటని పలు విమర్శలు వచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియాలో యువీపై అభ్యంతరాలు వచ్చినా అతడు పట్టించుకోలేదు. అయితే తాజాగా దళిత హక్కుల నేత రజత్ కల్సన్ హర్యాణాలోని హిస్సార్‌లో పోలీస్ కేసు పెట్టారు. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్న రోహిత్ శర్మ కూడా అడ్డుకోలేదని అతడిని సహ నిందితుడిగా చేరుస్తూ పిర్యాదు చేశారు. అంతేగాకుండా దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్, ఇతర పత్రాలను పోలీసులకు అందించారు. దళితులపై కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యువీని వెంటనే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.



Next Story