ఏపీలో రెండో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం

by  |
ఏపీలో రెండో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలలో భాగంగా నేతన్న నేస్తం పథకాన్ని 81,024 చేనేత కుటుంబాలకు అందజేస్తున్నారు. సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా 24,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా రెండో విడత నేతన్న నేస్తం పథకం అమలు చేశారు.

194.46 కోట్ల రూపాయలను 81,024 చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 24,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి లక్షా 20 వేల ఆర్థిక సాయం అందనుంది. అయితే వాస్తవానికి ఈ పథకం డిసెంబర్‌లో అమలు చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా అన్ని రంగాలు అతలాకుతలం కావడంతో జీవనోపాధి కరువైంది. ఈ నేపథ్యంలో నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల ముందే పథకాన్ని అమలు చేసింది. మరోవైపు ఆప్కో ద్వారా కోవిడ్ మాస్కుల తయారీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆప్కోకు 109 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Next Story

Most Viewed