తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్

by  |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతీలు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఈనెల 26న సిమ్లా వెళ్లిన జగన్ దంపతులు ఐదురోజులపాటు అక్కడే ఉన్నారు. ఈనెల 28న సీఎం జగన్ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవాన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నాం విజయవాడ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న జగన్ దంపతులు అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటనను ముగించుకుని సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తును అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పర్యటన
రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అనంతరం వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డా.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

Next Story

Most Viewed