ఎంపీ టికెట్​ ఇవ్వలేదని షర్మిలకు కోపం

by  |
ఎంపీ టికెట్​ ఇవ్వలేదని షర్మిలకు కోపం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వైఎస్​ షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్​ నేతలు స్పందించారు. ఎంపీ సీటు ఇవ్వలేదని అన్న జగన్‌పై షర్మిల కోపం పెంచుకుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు అన్నారు. అన్న మీద కోపంతో తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. అన్నపై కోపం ఉంటే షర్మిల ఆంధ్రలో పార్టీ పెట్టుకోవాలని, పార్టీలు పెట్టించడంలో బీజేపీ నాయకుడు అమిత్‌ షా దిట్ట అని అన్నారు. షర్మిల పార్టీలోకి కాంగ్రెస్‌కు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలెవ్వరూ వెళ్లరనే భావిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల ఏ సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా వీహెచ్‌ నిలదీశారు.

కాంగ్రెస్​కు నష్టమేమీ లేదు : షబ్బీర్​ అలీ

షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమీ లేదనిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. తెలంగాణలో త్వరలో పార్టీ పెడుతున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటన చేయడంపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ దయతోనే ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని, ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. వైఎస్ మరణంతో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగిందన్నారు. వైఎస్‌కు నిజమైన వారసులు కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రమేనని, ఆయన కుటుంబసభ్యులు కారని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనా?


Next Story

Most Viewed