30 మంది ఇండియన్ క్రియేటర్స్‌తో జట్టుకట్టిన యూట్యూబ్! ఎందుకోసమంటే?

62
Youtuber1

దిశ, ఫీచర్స్: యూట్యూబ్ భారతీయ మార్కెట్లో ‘క్రియేట్ విత్ కేర్’ (CreateWithCare) అనే కొత్త క్యాంపెయిన్ ప్రారంభిస్తుంది. ఇది ప్లాట్‌ఫామ్‌లోని సృష్టికర్తలను విభిన్నమైన, ఇన్‌క్లూజివ్, గౌరవప్రదమైన కంటెంట్‌ని ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం 30 మంది ఇండియన్ బేస్డ్ క్రియేటర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోగా, ఇది ప్రజలను ఆలోచనాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన కంటెంట్‌ని రూపొందించడమే కాకుండా, కిందిస్థాయి వ్యక్తుల గొంతు వినిపించే కమ్యూనిటీలను ప్రోత్సహిస్తుంది.

యూట్యూబ్‌కు అద్వీతీయ ఆదరణ పెరుగుతుండటం, ఎక్కువ మంది సృష్టికర్తలు రావడంతో ఇప్పటికే ఉన్నటువంటి క్రియేటర్స్‌తో పాటు, కొత్త సృష్టికర్తలకు సున్నితమైన కంటెంట్‌ను సృష్టించే బాధ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి #CreateWithCare క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ‘క్రియేట్ విత్ కేర్’ ప్రచారాన్ని ప్రోత్సహించడం కోసం యూట్యూబ్ భారతదేశంలోని బిగ్ క్రియేటర్స్‌తో జట్టుకట్టగా, ఇందులో ఎనిమిది ప్రాంతీయ భారతీయ భాషలకు చెందిన 30 మంది సృష్టికర్తలు ఉన్నారు. టెక్నికల్ గురూజీ, కబితా కిచెన్, ప్రజాక్త కోలి, మదన్ గౌరి, మై విలేజ్ షో, భడిపా, కుషియగి రమ్య, విశాల్ లాంగ్‌తాసా, వండర్ మున్నా, సాలు కిచెన్ వంటి బిగ్ యూట్యూబ్ చానల్స్ ఇందులో భాగమయ్యాయి. మైండ్‌ఫుల్ కంటెంట్‌ను సృష్టించడానికి, అభివృద్ధి చెందుతున్న సృష్టికర్తలకు స్ఫూర్తినిచ్చే వీడియోలు అందించడానికి వారంతా ప్రతిజ్ఞ చేశారని కంపెనీ పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌లో భాగమైన క్రియేటర్స్.. భిన్నత్వం, సంస్కృతులు, జనాభాలను గౌరవించే కంటెంట్‌పై పని చేస్తారని, ఇది మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడంతోపాటు సరైన పరిభాషను ఉపయోగిస్తుందని యూట్యూబ్ పేర్కొంది.

మహిళా క్రియేటర్స్ సంఖ్య పెరగాలి: రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
“భారతదేశంలో మహిళా సాధికారత మా ఎజెండాలో ప్రధానమైనది. ఇంటర్నెట్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు సురక్షితమైన ప్రదేశంగా ఉన్నప్పుడు మహిళలకు అవకాశాలను పెంచడంలో అమూల్యమైన పాత్రను పోషిస్తాయని మేము గుర్తించాము. బాధ్యతాయుతమైన కంటెంట్ సృష్టిని ప్రేరేపించడానికి #CreatewithCare ద్వారా ఆన్‌లైన్ భద్రత కోసం Youtube చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాను. మహిళా క్రియేటర్స్ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముంది. ఇదో ఉపాధి అవకాశంగా మలుచుకుంటే వాళ్లు కూడా ఇండిపెండెంట్‌ ఉమెన్‌గా ముందుకు సాగుతారు అది వారికి ఎంతో ఉపయుక్తం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..