ప్రాణం తీసిన త్రీజీ సిగ్నల్

by  |
ప్రాణం తీసిన త్రీజీ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫోన్ సిగ్నల్ సరిగా రావడం లేదని ఓ యువకుడు మరో ఊరికి వెళ్లి, సిగ్నల్ వచ్చే ప్రాంతంలోని ఓ చింతచెట్టు కింద నిల్చుని ఫోన్ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం మొదలైంది. అంతలోనే పెద్ద పెద్ద శబ్ధాలతో పిడుగు పడింది. దీంతో ఆ యువకుడు చెట్టుకిందనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడానికి చెందిన ఈసం కృష్ణ(22) తన మొబైల్‌లో త్రీజీ సిగ్నల్ సరిగా రావడం లేదని, పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామ సమీపంలోకి చింతచెట్టు కిందకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. వాస్తవానికి శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. కొందరు యువకులు సాయంత్రం సమయంలో చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు. కృష్ణ సైతం సిగ్నల్స్ కోసం పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.



Next Story

Most Viewed