పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు మృతి

by  |
పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు కలసి తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం తీసుకురావాలని అనుకున్నారు. దీంతో నలుగురు వ్యక్తులతో కలసి ఆటోలో తెలంగాణలోని దామరచర్లకు వచ్చారు. అక్కడ పుల్లుగా మద్యం తాగి, మరికొన్ని మద్యం బాటిళ్లును ఆటోలో ఏపీకి తీసుకొన్నారు.. మార్గమధ్యలో దామరచర్ల-వాడపల్లి వద్ద ఆటోను కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మున్నా(24) అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని పోలీసులు, క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించకండా అక్కడ నుంచి ఉడాయించారు. ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మున్నా స్నేహితులు ఇస్మాయిల్, జీవన్, ఆటో డ్రైవర్‌ మస్తాన్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ హుటాహుటిన బాధితుడిని దామరచర్లలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో తిరిగి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద సమాచారాన్ని మున్నా తల్లిదండ్రులకు తెలియజేయలేదు. అయితే చికిత్స పొందుతూ ఈనెల 23న మున్నా మృతిచెందాడు. ఈ విషయం మృతుడి తల్లిదుండ్రులకు తెలియడంతో ఈ నెల 25న దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల గుట్టు బయటపడింది.



Next Story

Most Viewed