PAN Card లో వివరాలు మార్చాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే

by  |
pan
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ పౌరులకు అతి ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి పాన్ కార్డ్. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయిన పాన్ కార్డు లేకుండా చేయడం కుదరదు. పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నంబర్. దీని ద్వారా ఆర్థిక పరమైన లావాదేవీలు జరుగుతాయి. మనం చేసే ప్రతి లావాదేవీ వివరాలు పాన్ కార్డు ద్వారా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. దీనిలో ఒక్క సారి పేరు నమోదైతే ఆ ఖాతా సంఖ్య (PAN) శాశ్వతంగా ఉంటుంది. దీనిలో ఉన్న మన డేటా ఎప్పటికీ మారదు. కానీ కొన్ని సార్లు ఏదైనా అత్యవసర మార్పులు ఉన్నప్పుడు మాత్రం రిక్వెస్ట్ ద్వారా పాన్ డేటా‌లో మార్పులు చేసుకోవచ్చు.

పాన్ నెంబర్ ఎప్పటికీ మారదు కానీ దానిలో ఇంటి పేరు, పుట్టిన తేదీ, చిరునామాలో మార్పుల కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రిక్వెస్ట్ ద్వారా తెలియజేయవచ్చు. సాధారణంగా ఇలాంటి మార్పులు వివాహం తర్వాత మహిళలకు అవసరమవుతాయి. వివాహనంతరం ఇంటి పేరు, చిరునామా మార్చుకోవాల్సి వస్తుంది. ఇలా పాన్ కార్డులో మార్పుల కోసం మనమే సొంతంగా ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు కింద తెలుసుకుందాం.

-మెుదటగా మీరు https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.

-డేటా మార్పు కోసం మార్పులు లేదా కరెక్షన్ ఎంచుకోండి.

-మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్ నంబర్, మొబైల్ నంబర్‌తో పాటు అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి.

-క్యాప్చా కోడ్‌లో ఫీడ్ చేయండి

-తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

PAN కార్డ్ హోల్డర్లు చిరునామా లేదా ఇంటిపేరు మార్చడానికి రూ.110 చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ వారు మార్చాలనుకుంటున్న చిరునామా భారతదేశం బయట ఉన్నట్లయితే రూ.1,020 చెల్లించాలి. మనం పంపిన రిక్వెస్ట్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలించి పాన్ డేటాబేస్‌లో మార్పులు చేస్తారు.

Next Story