మోడీతో సత్సంబంధాలు.. పాండిచ్చేరిలో ప్రముఖ యోగా గురువు మృతి

by  |
మోడీతో సత్సంబంధాలు.. పాండిచ్చేరిలో ప్రముఖ యోగా గురువు మృతి
X

దిశ, స్టేషన్ ఘనపూర్ : ప్రముఖ యోగా గురువు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాందాడి ఇంద్రసేన జీ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గురువారం అతన్ని మృతదేహాన్ని పాండిచ్చేరిలో ఖననం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి సోదరుడు ఇంద్రసేన జీ. బాల్యం నుండి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అలవర్చుకుని యోగా గురువుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు.

వందేమాతరం ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. యోగా శిక్షకుడిగా పాండిచ్చేరితో పాటు వివిధ రాష్ట్రాలతో పాటు రూమేనియా తరచూ వెళ్ళి వచ్చేవాడు. ఇటీవల పాండిచ్చేరికి వెళ్లిన ఆయన కరోనా బారిన పడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందగా గురువారం అక్కడే అంత్యక్రియలు జరిగాయి. బీజేపీలోని అగ్రనేతలు అద్వానీ, వెంకయ్య నాయుడు, వాజ్పేయి ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలు ఉన్న ఇంద్రసేన జీ మృతితో ఇప్పగూడెంలో విషాదం నెలకొంది.

Next Story

Most Viewed