ఇంకా నేను రెచ్చగొట్టడం మొదలు పెట్టలేదు !

by Shyam |
ఇంకా నేను రెచ్చగొట్టడం మొదలు పెట్టలేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని కొందరు అంటున్నారు కానీ, ఇంకా నేను రెచ్చగొట్టడం మొదలు పెట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన పై విధంగా స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే.. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి చొరబడ్డవారిపై, తుపాకులతో అరాచకాలు చేసేవారిపై సర్జికల్ స్ట్రైక్ చేయొద్దా అని ప్రశ్నించారు. రైతుల శ్రేయస్సు కోసమే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్న సంజయ్.. రైతుకు నచ్చిన ధరకు నచ్చినచోట అమ్ముకోవాలని చెప్పడం తప్పా అన్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం, అధికార పార్టీ వైఫల్యాలను చూస్తుంటే 2023లో బీజేపీనే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనూ కాషాయ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.Next Story

Most Viewed