ఏడాదిలోనే అత్యధిక కేసుల నమోదు

by  |
corona
X

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింది నీరులా రెండో వేవ్‌ రూపంలో దూసుకువస్తున్నది. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాదిలో గరిష్ట కేసులు శుక్రవారం నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 24,882 కేసుల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. గురువారం(23,285) కంటే శుక్రవారం కేసుల్లో 7 శాతం పెరుగుదల ఉన్నది. ఫలితంగా దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.13 కోట్లకు చేరాయి.

శుక్రవారం 20 లక్షల డోసుల పంపిణీ:

శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 20 లక్షల డోసులను పంపిణీ చేశారు. మొదటి డోసు కింద 16,39,663 డోసులు, రెండో డోసు కింద 4,13,874 పంపిణీ చేశారు. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 20,53,537 డోసులను దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం 7 గంటలకు పేర్కొంది. దీంతో మొత్తం శనివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో 2,82,18,457 డోసుల పంపిణీ జరిగింది.


Next Story

Most Viewed