రెండోదశ పోల్స్‌లో వైసీపీకి తక్కువ సీట్లు.. కారణం ఇదే!

by  |
ycp flag, cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ పోరులో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నా తమ అధికార వైబ్‌సైట్‌లో మాత్రం తక్కువ సీట్లు చూపిస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికొస్తే రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. బీజేపీ, జనసేన తరువాతి స్థానాల్లో కొంత మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. కానీ, పంచాయతీ పోరులో వైసీపీకి తక్కువ సీట్లు వచ్చినట్లు చూపించడంపై వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం 3,328 పంచాయతీ స్థానాలకు రెండోదశ కౌంటింగ్ కొనసాగుతుండగా ఇందులో 539 స్థానాలు ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఇందులోనూ వైసీపీ అభ్యర్థులు దూకుడును కనబరుస్తున్నారు. అయితే, పోలింగ్ కేంద్రం వద్ద లీడింగ్‌లో ఉన్న అభ్యర్థులు, గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య మాత్రం వైసీపీ అధికారిక వైబ్‌సైట్‌లో తప్పుగా చూపిస్తోంది. అందుకు ప్రతిగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు చూపించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకత్వం వద్దకు తీసుకెళ్లగా అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్‌ను కొందరు కేటుగాళ్లు క్రియేట్ చేసినట్లు తేలింది. అంతకుముందు ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి జగన్ ప్రభుత్వం అధికారికంగా వైసీపీ వైబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో వైసీపీ గెలుచుకున్న సీట్లను కావాలనే టీడీపీకి వచ్చినట్లు కేటుగాళ్లు చూపించినట్లు గుర్తించారు.

అసలు విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Next Story