ICC WTC Final 2021 : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 4000 మంది ప్రేక్షకులు

by  |
ICC WTC Final 2021 : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 4000 మంది ప్రేక్షకులు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ఇండియా, న్యూజీలాండ్ మధ్య జూన్ 18 నుంచి 22 మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్నది. కరోనా మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని ఈసీబీ నిర్ణయించింది. ప్రతీ రోజు 4 వేల మంది ప్రేక్షకుల కోసం టికెట్లు అమ్మకానికి పెడతామని హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. ఈ 4 వేల టికెట్లలో సగం టికెట్లు ఐసీసీ స్పాన్సర్లు, భాగస్వామ్యులకు కేటాయించామని.. మిగిలిన 2 వేల టికెట్లను అమ్మకానికి పెడతామని హాంప్‌షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ ప్రకటించారు. కాగా, తక్కువ టికెట్లు ఉండటంతో కౌంటీ క్లబ్ ధరలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా న్యూజీలాండ్ నుంచి భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్ చేరుకుంటున్నారు. దీంతో కౌంటీ క్లబ్ కొన్ని టికెట్లను రూ. 1 లక్ష ప్రీమియం ధరకు కూడా అమ్మాకానికి పెట్టింది. మరోవైపు బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం. కాగా, 2020లో కరోనా లాక్‌డౌన్ అనంతరం క్రికెట్ ప్రారంభమైనా ఇంగ్లాండ్‌లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. దాదాపు ఏడాది తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తుండటంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది.India vs New Zealand Live Streaming FREE, TV Channel, WTC Final 2021

Next Story