ప్రధాని మోడీ పదవి మార్పు పై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

by Mahesh |
ప్రధాని మోడీ పదవి మార్పు పై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వేళ బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీని కొద్దిరోజులకే దించేస్తారని.. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పార్టీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయస్సు నిండిన వారికి పార్టీలో ఎలాంటి పదవులు ఉండవు. దీనిని ఆ పార్టీ నిరూపించుకుంటుంది. అందుకే 2027 తో మోడీకి 75 సంవత్సరాలు వస్తాయి. దీంతో బీజేపీ అధికారంలో వస్తే మోడీ స్థానంలో మరో వ్యక్తి ప్రధాని అవుతారని అరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరు ఎలా స్పందిస్తారని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి సమాధానంగా.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోడీని తమ ప్రధానిగా ఎన్నుకుంటున్నారు. జూన్ నాలుగు ఫలితాల తర్వాత ఆయనే ప్రధాని అవుతారు. 2029 వరకు మేడినే భారత ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా ఆయనే మా ప్రధాని అభ్యర్థిగా ఉంటాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే బెంగాల్ లో ఈ సారి బీజేపీ 24 నుంచి 30 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో మేము సౌతిండియాలో సాధించే ఎంపీ స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గెలిచే స్థానాల కంటే ఎక్కువగా ఉంటాయని అన్నారు.

Next Story

Most Viewed