గన్నుతో బ్యాంకులోకి చొరబడిన మహిళ.. తీరా చూస్తే..

by Dishafeatures2 |
గన్నుతో బ్యాంకులోకి చొరబడిన మహిళ.. తీరా చూస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నుతో ఓ మహిళ బ్యాంకులోకి చొరబడింది. బ్యాంకులో ఉండిపోయిన తన సేవింగ్స్ కోసమే ఆ మహిళ ఇలా చేసింది. అయితే ప్రస్తుతం లెబనాన్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళ బ్యాంకులో ఇరుక్కుపోయిన తన 13 వేల డాలర్ల సేవింగ్స్‌ను ఎలాగైనా తీసుకోవాలని భావించింది. అంతే ఓ బొమ్మ తుపాకీ తీసుకొని బ్యాంకులోని చొరబడింది.

అయితే ఆమె ఆ డబ్బును తన సోదరి క్యాన్సర్ చికిత్స కోసం తీసుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకే తన మేనల్లుడి బొమ్మ తుపాకీ తీసుకుని బ్యాంకులోకి వెళ్లానని తెలిపింది. తన డబ్బు ఇప్పించమని అనేక సార్లు బ్యాంకు మేనేజర్‌ను వేడుకున్నానని, కానీ వారు తన గోడు పట్టించుకోలేదని, కేవలం నెలకు లెబనీస్ పౌండ్స్‌లలో 200 డాలర్లు మాత్రమే తనకు వస్తాయని తెలిపారని ఆ మహిళ చెప్పుకొచ్చింది.

తాను, మరికొందరు ఆందోళనకారుల గ్రూప్‌తో కలిసి బ్యాంకులోకి వెళ్లి, అక్కడ మేనేజర్ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించామని, ఆ తర్వాత తమకు 12 వేల డాలర్లు, ఒక వెయ్యి లెబనీస్ పౌండ్లు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులను బెదింరించానని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. దాంతో పాటుగా తాను ఎవరినీ చంపాలన్న ఆలోచనతో బ్యాంకులోకి వెళ్లలేదని, తన హక్కులను అందుకునేందుకే వెళ్లానని ఆమె రాసుకొచ్చింది.



Next Story

Most Viewed