విమానం నుంచి నిప్పురవ్వలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

by Dishanational4 |
విమానం నుంచి నిప్పురవ్వలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: నెవార్క్ నుండి బ్రెజిల్‌లోని సావో పాలోకు వెళ్తున్నయునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుండి నిప్పురవ్వలు ఎగిసిపడడంతో యూస్ నెవార్క్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే విమానం కూడా సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులకు ప్రమాదం నుంచి బయటపడ్డారు. విమానంలో మెకానికల్ సమస్య కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి ఆగ్నేయంగా 130km దూరంలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పడినట్లు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed