ఇండియా సహకారం అత్యవసరం అంటున్న ఉక్రెయిన్‌.. ఎందుకు ?

by Dishanational4 |
ఇండియా సహకారం అత్యవసరం అంటున్న ఉక్రెయిన్‌.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యాతో శాంతి ప్రక్రియలో తమకు సహకారాన్ని అందించాలని భారత్‌ను ఉక్రెయిన్ కోరింది. త్వరలో స్విట్జర్లాండ్‌ వేదికగా జరగనున్న శాంతి సదస్సులో భారత్ కూడా పాల్గొనాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా రిక్వెస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారతదేశ దృక్పథంలో చాలా మార్పు వచ్చిందన్నారు. గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న కులేబా.. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతంలో భాగంగా తాను శుక్రవారం రోజు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీతో భేటీ అవుతానని ఆయన వెల్లడించారు. స్విట్జర్లాండ్‌‌లో జరగనున్న శాంతి సదస్సులో కీలక పాత్ర పోషించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతానని కులేబా చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్‌ను భారత్ రూపాయిల్లో చేస్తుండటం మంచి పరిణామమని దిమిత్రో కులేబా తెలిపారు. దానివల్ల రష్యా కంటే భారత్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


Next Story

Most Viewed