పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం: భారీ వర్షాల కారణంగా 33 మంది పిల్లలు మృతి

by Dishanational2 |
పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం: భారీ వర్షాల కారణంగా 33 మంది పిల్లలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ఘటనల్లో 33 మంది పిల్లలు సహా 63 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 78 మంది గాయపడ్డట్టు వెల్లడించారు. మరణించిన వారిలో 33 మంది పిల్లలు, 15 మంది మహిళలు. 15 మంది పురుషులు ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే 477 ఇళ్లు ధ్వంసమవగా, 2,725 ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలిపాయి. గత 24 గంటల్లో మలాం జబ్బాలో 58 మిల్లీమీటర్లు, ఎగువ దిర్ 49 మిల్లీమీటర్లు, కాకుల్ 43, బచా ఖాన్ 41, తఖ్త్ బాయిలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ భారీ వర్షాలు మరిన్ని రోజులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పంటలు, ఇళ్లు ఎక్కువగా దెబ్బతింటాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్షియల్ ప్రభుత్వం ప్రభావిత జిల్లాలకు రూ.11 కోట్లు విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే కొత్తగా విలీనమైన జిల్లాలకు రూ.9కోట్లు విడుదల చేశారు.



Next Story

Most Viewed