'వర్క్ ఫ్రమ్ హోమ్ అనైతికం'.. ఎలన్ మస్క్

by Dishafeatures2 |
వర్క్ ఫ్రమ్ హోమ్ అనైతికం.. ఎలన్ మస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వర్క్ ఫ్రమ్ హోం అనేది అనైతికమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని గతం నుంచి వ్యతిరేకిస్తున్న మస్క్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది కార్మికులు పని ప్రదేశాల్లో కష్టపడుతున్నారని, కార్ల తయారీ, వాహన సర్వీసింగ్, భవన నిర్మాణ కార్మికులు, వంట మనుషులు వీరితో పాటు వివిధ రంగాల్లో ఉన్న వారు తమ పనులను యథావిధిగా చేసుకుంటుంటే మరి కొంత మంది వర్క్ ఫ్రమ్ హోం లో ఉంటున్నారని ఇలా చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని చూసి మరో రకంగా అనుకునే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్పాదకతకు సంబంధించిన విషయం మాత్రమే కాదని ఇది నైతిక పరమైన విషయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానం వల్ల ఆశించినంత ఉత్పాదకత సాధించలేమని ఈ సందర్భంగా టెస్లా ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్లా ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలైనా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని ఆదేశించారు.

Also Read..

100 గంటలు నాన్‌స్టాప్‌ కుకింగ్.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన నైజీరియన్ లేడీ!



Next Story

Most Viewed