కెనడాలో హిందూ దేవాలయం ధ్వంసం.. దర్యాప్తు కోరిన భారత్..

by Dishafeatures2 |
కెనడాలో హిందూ దేవాలయం ధ్వంసం.. దర్యాప్తు కోరిన భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ దేవాలయాలు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే తాజాగా కెనడా టొరంటోలో ఉన్న బాప్స్ స్వామి నారాయణ దేవాలయాన్ని కొందరు ఆగంతుకులు గురువారం ధ్వంసం చేశారు. దేవాలయంలోని గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారు. దీనిపై స్పందించిన భారత్ ఎంబసీ వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేవాలయాన్ని ద్వంసం చేయడంపై భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ఇందుకు పాల్పడిన వ్యక్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని కెనడా అధికారులను కోరింది. ఈ ఘటనపై బ్రాంప్‌టన్ ఎంపీ సోనియా సింధు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'మనం వివిధ సంప్రదాయాలు, వివిధ నమ్మకాల సమాజంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఫీల్ అవ్వాలి. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే కనుగొనాలి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి' అని ఆమె ట్వట్‌లో రాసుకొచ్చారు.



Next Story

Most Viewed