ఎలాన్ మస్క్​‌కు షాక్.. రెండోసారీ ‘స్టార్​షిప్’ ప్రయోగం ఫెయిల్

by Harish |
ఎలాన్ మస్క్​‌కు షాక్.. రెండోసారీ ‘స్టార్​షిప్’ ప్రయోగం ఫెయిల్
X

వాషింగ్టన్: ఎలాన్ మస్క్​కు చెందిన అంతరిక్ష సేవల కంపెనీ స్పేస్​ఎక్స్ నిర్వహించిన ‘స్టార్​షిప్-2’ బాహుబలి రాకెట్​ ప్రయోగం వరుసగా రెండోసారి కూడా ఫెయిలైంది. 400 అడుగుల (121 మీటర్లు) హైట్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ రాకెట్‌‌ను శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ప్రయోగించగా తొలుత విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లింది. అయితే కమ్యూనికేషన్​ వ్యవస్థ దెబ్బతిని 8 నిమిషాల్లోనే రాకెట్​ సిగ్నల్స్​ కోల్పోయింది. అనంతరం సాంకేతిక విశ్లేషణ చేయగా.. రాకెట్‌లోని ఇంజిన్లలో జంట పేలుళ్లు సంభవించాయని గుర్తించారు.

ఇంతకుముందు ఏప్రిల్‌లో ‘స్టార్‌షిప్’ రాకెట్‌ను తొలిసారిగా నింగిలోకి ప్రయోగించగా.. అది 4 నిమిషాల్లోనే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ​ కుప్పకూలింది. ఈ చేదు అనుభవంతో అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (ఎఫ్ఏఏ) సూచనల ఆధారంగా ‘స్టార్‌షిప్‌-2’లో శాస్త్రవేత్తలు 57 కీలక మార్పులను చేశారు. మొదటి ప్రయోగం ఫెయిలైన దాదాపు ఏడు నెలల తర్వాత ఎఫ్‌ఏఏ అనుమతితో రెండోసారి ఈ ప్రయోగం నిర్వహించారు.Next Story

Most Viewed